ఎంతో భయంతో నేనా పాత్రను పోషించాను : కీర్తి సురేశ్

ఎంతో భయంతో నేనా పాత్రను పోషించాను : కీర్తి సురేశ్
X

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 2000లో విడుదలైన ‘పైలట్స్’ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. తర్వాత మోహన్‌లాల్ నటించిన ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ, తెలుగు సినీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘మహానటి, సర్కార్, పెంగ్విన్, అజ్ఞాతవాసి’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల్లో నటించింది. అయితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో తనను చాలా భయపెట్టిన ఒక పాత్ర గురించి ఆమె ఓపెన్ అయింది.

తన సినీ ప్రయాణంలో ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా? అనే ప్రశ్నకు కీర్తి స్పందిస్తూ.. తన జీవితాన్ని మార్చేసిన సినిమా ‘మహానటి’ అని చెప్పింది. సావిత్రిగా నటించడం నాకు ఒక మహత్తరమైన సవాల్‌గా అనిపించింది. ఆ పాత్రను ఎలా పోషిస్తానో అన్న భయం నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఎంతో భయంతోనే నేను నటించాను” అని ఆమె వెల్లడించింది. అయితే, ఆ మొదటి భయాన్ని అధిగమించి.. అద్భుతమైన నటనను ప్రదర్శించి, ఆమె సినీ ప్రస్థానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్ అద్భుతమైన అభినయం విపరీతమైన ప్రశంసలు అందుకుంది. సావిత్రి జీవితంలోని భావోద్వేగాలు, హావభావాలు, మానసిక సంఘర్షణలను కీర్తి సరిగ్గా పట్టుకుని.. వాటిని అత్యద్భుతంగా తెరపై ఆవిష్కరించగలిగింది. ఈ పాత్ర ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఆమె ప్రతిభను పరీక్షించడమే కాకుండా.. తనపై నమ్మకాన్ని పెంచింది.

ప్రస్తుతం.. కీర్తి సురేష్ తన తాజా తమిళ ప్రాజెక్ట్స్ ‘రివాల్వర్ రిటా, కన్నివెడి’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉంది. విభిన్నమైన కథాంశాలతో, గట్టి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కీర్తి.. మరోసారి అద్భుతమైన నటనను ప్రదర్శిస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story