‘హృదయపూర్వం’ చిత్రానికి సెన్సార్ పూర్తి !

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి యూ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని మోహన్‌లాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా ఆగస్టు 28న ఓణం సందర్భంగా ఒడుం కుతిర చాడుం కుతిర, లోకహ్ చాప్టర్ 1: చంద్ర, మైనే ప్యార్ కియా చిత్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హృదయపూర్వం టీజర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం మోహన్‌లాల్, సత్యన్ అంతిక్కాడ్‌లను దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిపింది.
ఈ సినిమాలో మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలు అలెక్స్, జనార్దనన్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథను అఖిల్ సత్యన్ రాయగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను సోను టీపీ రచించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబావూర్ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.
-
Home
-
Menu