రిటైర్ అయిన తర్వాత ఊబెర్ డ్రైవర్ గా పనిచేస్తాను : ఫహద్ పాజిల్

రిటైర్ అయిన తర్వాత ఊబెర్ డ్రైవర్ గా పనిచేస్తాను : ఫహద్ పాజిల్
X
రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనాలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయాలనే తన ప్లాన్‌ను కూడా మళ్లీ గుర్తు చేశాడు.

సోషల్ మీడియాలో స్టార్స్ యాక్టివ్‌గా ఉంటూ, లగ్జరీ గాడ్జెట్స్‌తో తమ లైఫ్‌స్టైల్‌ను చూపించే ఈ యుగంలో, ఫహద్ ఫాసిల్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌ను సింపుల్‌గా, లో-ప్రొఫైల్‌గా ఉంచడంలో పేరుగాంచాడు. రీసెంట్‌గా, అతను కీప్యాడ్‌తో కూడిన వర్చు మొబైల్ ఫోన్‌తో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని “డంబ్ ఫోన్” అని పిలిచిన ఫహద్, సోషల్ మీడియా లేదా వాట్సాప్‌కు ఎందుకు దూరంగా ఉంటాడో కూడా చెప్పాడు. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనాలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయాలనే తన ప్లాన్‌ను కూడా మళ్లీ గుర్తు చేశాడు.

లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహద్ ఇలా అన్నాడు.. “గత ఏడాది నుంచి నేను డంబ్ ఫోన్ ఉపయోగిస్తున్నా. ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరమయ్యా. మరో రెండేళ్లలో నన్ను ఈమెయిల్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయగలరు. మొదట్లో నేను సోషల్ మీడియాలో ఉన్నాను, కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయా. ఏం పోస్ట్ చేయాలో, ఏం రిప్లై చేయాలో నాకు తెలియలేదు. ఒక విషయం మాత్రం క్లియర్, నా పర్సనల్ ఫోటోలు లేదా నా ఇంటి నుంచి ఏ ఒక్క ఫోటోనూ పోస్ట్ చేయను. కాబట్టి, నా కెరీర్ గురించి మాత్రమే అప్డేట్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు సోషల్ మీడియా లేదు, వాట్సాప్ కూడా లేదు. ఏదీ మిస్ అవుతున్నట్లు అనిపించడం లేదు. జెన్-జీ నుంచి డిస్‌కనెక్ట్ అయినట్లూ అనిపించడం లేదు, ఎందుకంటే నేను మంచి సినిమాలు చేస్తున్నా. ఏ రోజైనా నేను చెత్త సినిమాలు చేయడం మొదలుపెడితే, అప్పుడు ఈ జనరేషన్‌తో కనెక్షన్ తప్పినట్లు ఫీలవుతాను.”

2020లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఫహద్ రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనాలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ ప్లాన్ ఇంకా అలాగే ఉందా అని అడిగినప్పుడు, అతను ఇలా అన్నాడు: “పక్కాగా. కొన్ని నెలల క్రితం మేము బార్సిలోనాలో ఉన్నాం. అది జరగాలంటే, ప్రజలు నన్ను వదిలేసిన తర్వాతే, అర్థమైంది కదా? జోక్ పక్కనపెడితే, ఎవరినో ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం, వాళ్ల డెస్టినేషన్‌ను చూడడం… ఇది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా నేను ఇప్పటికీ అలా చేస్తాను. డ్రైవింగ్ మాత్రమే కాదు, నాకు ఇష్టమైన గేమ్, స్పోర్ట్ లేదా టీవీ చూడటం… నాకు నచ్చినవి చేయడం.” అన్నాడు ఫహద్.

Tags

Next Story