అనుష్క శెట్టి డెబ్యూ మలయాళ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభం !

మాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న "కత్తనార్: ది వైల్డ్ సోర్సరర్" సినిమా డబ్బింగ్ ప్రారంభమైందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ‘కడమట్టత్తు కత్తనార్’ అనే కేరళ పూజారి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్. అతను అసాధారణమైన శక్తులను కలిగి ఉన్నాడని నమ్మేవారు. "హోమ్" ఫేమ్ రోజిన్ థామస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
టాలెంటెడ్ హీరో జయసూర్య ‘కత్తనార్’ పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రముఖ దక్షిణాది నటి అనుష్క శెట్టి ఈ సినిమాతో మలయాళ చిత్రసీమలో అడుగుపెడుతోంది. అంతేకాదు, ప్రభుదేవా 13 సంవత్సరాల తర్వాత మలయాళ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు చివరిసారిగా "ఉరుమి" లో కనిపించారు. అలాగే, ‘లియో’ చిత్రంలో తన విలన్ పాత్రతో గుర్తింపు పొందిన సాండీ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, అధిక శాతం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ద్వారా తెరకెక్కినట్లు సమాచారం. సినిమాటోగ్రఫీని నీల్ డి కున్హా, యాక్షన్ కొరియోగ్రఫీని జంగ్‌జిన్ పార్క్, సంగీతాన్ని రాహుల్ సుబ్రహ్మణియన్ ఉన్ని అందిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న "కత్తనార్: ది వైల్డ్ సోర్సరర్" సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
-
Home
-
Menu