థ్రిల్లర్స్ తో ఈ దర్శకుడికి విసుగు పుట్టిందట !

థ్రిల్లర్స్ తో ఈ దర్శకుడికి  విసుగు పుట్టిందట !
X
“నాకు థ్రిల్లర్‌లతో విసుగు పుట్టింది. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నా, అది విఫలమైనా సరే. నేను గతంలో లైట్-హార్టెడ్ సినిమాలు కూడా తీశాను. కానీ ‘దృశ్యం’ తర్వాత నన్ను ఈ జానర్‌లోనే బంధించారు.

మలయాళ సినిమా దర్శకుడు జీతు జోసెఫ్ మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమాతో గుర్తింపు పొందారు. ఈ చిత్రం భారతీయ సినిమాల్లో అత్యుత్తమ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. ‘దృశ్యం 2’ కూడా మొదటి భాగంలాగానే .. ఆకర్షణీయంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ నటుడు-దర్శకుడి జోడీ ‘దృశ్యం3’ తో ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే.. జీతు జోసెఫ్ ఈ థ్రిల్లర్ జానర్‌తో విసిగిపోయానని చెప్పారు. ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఆయన మాట్లాడుతూ, మలయాళ సినిమా ఇండస్ట్రీలో థ్రిల్లర్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని తెలిపారు. “నాకు థ్రిల్లర్‌లతో విసుగు పుట్టింది. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నా, అది విఫలమైనా సరే. నేను గతంలో లైట్-హార్టెడ్ సినిమాలు కూడా తీశాను. కానీ ‘దృశ్యం’ తర్వాత నన్ను ఈ జానర్‌లోనే బంధించారు. తెలుగు, తమిళ నిర్మాతలు కూడా ప్రతి సినిమాలో ‘జీతు జోసెఫ్ లాజిక్’ కోరుకున్నారు,” అని ఆయన అన్నారు.

ఒకే రకమైన కథనం పునరావృతం చేయడం ప్రేక్షకులను విసిగించవచ్చని జీతు స్పష్టం చేశారు. ‘దృశ్యం3’ కథను జార్జ్‌కుట్టి కుటుంబానికి సరైన ముగింపు దొరికిన తర్వాతే రూపొందించానని చెప్పారు. “ఇది రిస్క్‌తో కూడుకున్నది, కానీ కథ సహజంగా ఈ దిశగా సాగాల్సి వచ్చింది.. ” అని ఆయన తెలిపారు. అయితే, ‘దృశ్యం3’ కోసం లాజిక్‌ను పక్కాగా రాసేందుకు అదనపు పేజీలు రాయాల్సి వచ్చిందని, ఈ విషయంలో కొంత నిరాశ వ్యక్తం చేశారు జీతు జోసెఫ్.

Tags

Next Story