దిలీప్ ‘భభబ’ మూవీ షూటింగ్ పూర్తి !

మలయాళ జనప్రియ నాయకుడు దిలీప్ నటించిన ‘భభబ’ (భయం భక్తి బహుమానం) సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. 2024 జులైలో మొదలైన ఈ చిత్రం వివిధ షెడ్యూల్స్‌లో షూట్ చేశారు. షూటింగ్ ముగింపును ప్రకటిస్తూ, నిర్మాతలు సోషల్ మీడియాలో ఇలా రాశారు. "ఎన్నో రోజులు, రాత్రులు, విభిన్న లొకేషన్లు, భూభాగాల్లో శ్రమించిన తర్వాత, ఈ ఉదయం మేం షూటింగ్‌ను ముగించాం. ఇప్పుడు మా 'మ్యాడ్‌నెస్ వరల్డ్'లోకి మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం.
"భ భ బ చిత్రాన్ని ధనంజయ్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఇది యాక్షన్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం చేస్తున్నారు. నటీనటులు నూరిన్ షరీఫ్, ఫహీమ్ సఫర్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. గోకులం గోపాలన్ నిర్మించారు. ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, సరన్య పొన్వన్నన్, సిద్ధార్థ్ భరతన్, బైజు సంతోష్, అశోకన్, మణియన్‌పిళ్ల రాజు నటిస్తున్నారు.
మోహన్‌లాల్ ఈ చిత్రంలో కామియో రోల్‌లో కనిపిస్తారని బలమైన ఊహాగానాలు ఉన్నప్పటికీ, నిర్మాతలు ఇంకా దీన్ని ధృవీకరించలేదు. సినిమా టెక్నికల్ టీమ్‌లో సినిమాటోగ్రాఫర్ ఆర్మో, సంగీత దర్శకుడు షాన్ రెహమాన్, ఎడిటర్ రంజన్ అబ్రహం ఉన్నారు.
-
Home
-
Menu