దిలీప్ 150వ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ !

దిలీప్ 150వ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ !
X
గతంలో ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమాను.. తాజాగా మే 9 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మాలీవుడ్ జనప్రియ నాయకుడు దిలీప్ 150వ చిత్రంగా రూపొందుతున్న ఫ్యామిలీ మూవీ ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేశారు. గతంలో ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమాను.. తాజాగా మే 9 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి.. దిలీప్‌తో పాటు మంజు పిళ్లై, జోస్ ఆంటోని కనిపించే కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాను నూతన దర్శకుడు బింటో స్టీఫెన్ తెరకెక్కిస్తుండగా.. స్క్రీన్‌ప్లేను షారిస్ మహమ్మద్ రచించారు. ఆయన ‘జన గణ మన, క్వీన్, మలయాళీ ఫ్రం ఇండియా’ వంటి చిత్రాలకు రచయితగా పని చేశారు. కుటుంబ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్ధిక్, ధ్యాన్ శ్రీనివాసన్, బిందు పనిక్కర్, పార్థవి రాజన్ శంకరాడి, రోజ్‌బెత్ జాయ్, అశ్విన్ పి జోస్, జోసెట్టి జేకబ్, వినీత్ తట్టి డేవిడ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరో వైపు దిలీప్ నటిస్తున్న మరో చిత్రం ‘భా భా బా’ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ధనంజయ్ శంకర్ రూపొందిస్తున్నారు. ఫహీమ్ సఫర్, నూరిన్ షెరీఫ్‌లకు స్క్రిప్ట్ రాయగా, దిలీప్‌తో పాటు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

Tags

Next Story