‘ధీరన్’ మలయాళ చిత్రం వచ్చేది అప్పుడే !

‘ధీరన్’ మలయాళ చిత్రం వచ్చేది అప్పుడే !
X
ఈ సినిమా లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చీర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాను జూలైలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

"ధీరన్" అనే మలయాళ సినిమా ఒక ఆసక్తికరమైన నటీనటుల బృందంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ భరతన్, వినీత్, అభిరామ్ రాధాకృష్ణన్, ఇందుమతి మణికందన్, శబరీష్ వర్మ, శ్రీకృష్ణ దయాళ్, అశ్వతి మనోహరన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చీర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాను జూలైలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

చీర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గతంలో "వికృతి", "జానేమన్", "జయ జయ జయ జయ హే", "ఫ్యాలిమీ" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంస్థగా పేరుగాంచింది. ఈ చిత్రానికి అర్బన్ మోషన్ పిక్చర్స్, యూవీఆర్ మూవీస్, జాన్ పి అబ్రహం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రాజేష్ మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాజేష్ మాధవన్ గతంలో "సురేషుండేయుం సుమలతండేయుం, హృదయహరియాయ ప్రణయకథ" చిత్రాలతో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత "మరణమాస్" చిత్రంలో విలన్‌గా నటించి.. తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఈ చిత్రంలో అతని పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Tags

Next Story