ఓణం క్లాష్ లో విజేత ఎవరు?

ఓణం క్లాష్ లో  విజేత ఎవరు?
X
ఆసక్తికరంగా, ‘హృదయపూర్వం’, ‘లోక’ రెండూ పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్నాయి. అయితే, నిజమైన పోటీ మాత్రం ‘హృదయపూర్వం’ అండ్ ‘లోక’ మధ్యే జరిగింది.

ఈ ఓణం పండుగ సీజన్‌లో.. మాలీవుడ్ నుంచి మూడు సినిమాలు తలపడ్డాయి. అవి మోహన్‌లాల్ నటించిన ‘హృదయపూర్వం’, కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘లోక’, ఫహద్ ఫాసిల్ నటించిన ‘ఓడుం కుతిర చాదుం కుతిర’. అయితే, నిజమైన పోటీ మాత్రం ‘హృదయపూర్వం’ అండ్ ‘లోక’ మధ్యే జరిగింది.

‘హృదయపూర్వం’ మూవీ ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా కాగా, ‘లోక’ ఒక సూపర్ హీరో సాగా. ఈ రెండు సినిమాల్లో ఏది గెలుస్తుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుక్ మై షో లో తొలి ట్రెండ్స్ ప్రకారం.. ‘లోక’ సినిమా ముందంజలో ఉంది. కల్యాణి ప్రియదర్శన్ సినిమా, గంటగంటకూ ట్రెండింగ్‌లో మోహన్‌లాల్ సినిమాను మించిపోతోంది.

అయితే.. ఇవి కేవలం తొలి ట్రెండ్స్ మాత్రమే. వీకెండ్ వరకు వేచి చూస్తేనే ఏ సినిమా అగ్రస్థానంలో నిలుస్తుందో తెలుస్తుంది. ఆసక్తికరంగా, ‘హృదయపూర్వం’, ‘లోక’ రెండూ పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్నాయి. సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మాణంలో వచ్చిన ‘హృదయపూర్వం’ లో మోహన్‌లాల్‌తో పాటు మాళవిక మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక ‘లోక’ అలియాస్ లోక : చాప్టర్ 1 చంద్ర సినిమా డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన సినిమా. ఇందులో ప్రేమలు ఫేమ్ నస్లెన్, సాండీ, అరుణ్ కురియన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. మరి వీకెండ్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Next Story