అసిఫ్ ఆలీ కొత్త చిత్రం ‘ఆభ్యంతర కుట్టవాళి’ రిలీజ్ అప్పుడే !

అసిఫ్ ఆలీ కొత్త చిత్రం ‘ఆభ్యంతర కుట్టవాళి’ రిలీజ్ అప్పుడే !
X

మలయాళ నటుడు అసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘ఆభ్యంతర కుట్టవాళి’ (డొమెస్టిక్ క్రిమినల్). ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించడంతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేసింది. డెబ్యూ దర్శకుడు సేథునాథ్ పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిజజీవితానికి దగ్గరగా ఉండే కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

ఈ సినిమాతో తులసి అనే అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. జగదీశ్, హరీశ్రీ అశోకన్, ప్రేమ్ కుమార్, సిద్ధార్థ్ భరతన్, అజీజ్ నెడుమాంగాడ్, విజయకుమార్, బాలచంద్రన్ చుల్లిక్కాడ్, ఆనంద్ మన్మధన్, ‘ఆవేశం’ ఫేమ్ నీరజా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సహదేవన్ అనే యువకుడు తన భార్యపై కట్నం కోసం హింసా ప్రవర్తన చూపించిన కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్నట్లు టీజర్ లో తెలుస్తోంది. ఈ చిత్రానికి అజయ్ డేవిడ్ కచప్పిల్లి సినిమాటోగ్రాఫర్‌గా, బిజిబాల్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. గతంలో బేసిల్ జోసఫ్ నటించిన ‘కఠిన కఠోరమీ అంధకాహడం’ మూవీని నిర్మించిన నైసమ్ సలామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం అసిఫ్ అలీ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 2024లో ‘కిష్కింధ కాండం’ సక్సెస్ సాధించగా.. తాజాగా విడుదలైన ‘రేఖాచిత్రం’ కూడా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం అతడు థామర్ కెవి దర్శకత్వం వహిస్తున్న ‘సర్కీట్’, జీతూ జోసఫ్ దర్శకత్వంలో అపర్ణా బాలమురళితో కలిసి ‘మిరాజ్’, రోహిత్ వీఎస్ రూపొందిస్తున్న ‘టికీ టాకా’, ‘తలవన్’ సీక్వెల్, ప్రజేష్ సెన్ తెరకెక్కిస్తున్న ‘హౌడినీ – ది కింగ్ ఆఫ్ మ్యాజిక్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

Tags

Next Story