ఆరోసారి అసిఫ్ ఆలీ, అపర్ణ బాలమురళి జోడీ !

మలయాళ సూపర్ హిట్ పెయిర్ అసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "మిరేజ్" చిత్రానికి సంబంధించిన ప్రధాన చిత్రీకరణ 48 రోజుల పాటు సాగి.. ఎట్టకేలకు తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జీతూ జోసఫ్ తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ కథను అపర్ణా ఆర్ తరకడ్ రచించగా.. జీతూ జోసఫ్, శ్రీనివాస్ అబ్రోల్ కలిసి స్క్రిప్ట్ రచించారు.
"మిరేజ్" చిత్రంలో హకీమ్ షాజహాన్, హన్నా రెజి కోషి, సంపత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విష్ణు శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముకేష్ ఆర్ మెహతా, జతిన్ ఎం. సెథీ, సి.వి. సారథి కలిసి ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అసిఫ్ అలీ మరియు అపర్ణా బాలమురళి కలిసి నటించడం ఇదే ఆరవ సారి. వీరిద్దరూ ఇంతకు ముందు "త్రిశివపేరూర్ క్లిప్తం," "సండే హాలిడే," "బీటెక్," "2018," "కిష్కింద కాండం" చిత్రాల్లో కలిసి నటించారు.
ఇక, జీతూ జోసఫ్ ఈ చిత్రం కంటే ముందు అసిఫ్ అలీ హీరోగా "కూమన్" , అపర్ణా బాలమురళి లీడ్ రోల్ లో "మిస్టర్ అండ్ మిసెస్ రౌడీ" చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక అసిఫ్ అలీ, తొలిసారిగా సేతునాథ్ పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆభ్యంతర కుట్టవాళి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అపర్ణా బాలమురళి ఇటీవల రాజ్ బ్ శెట్టి సరసన "రుధిరం" అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో కనిపించారు.
-
Home
-
Menu