అనుష్క మలయాళ డెబ్యూ చిత్రం ‘కథనార్’

అందాల హీరోయిన్ అనుష్కా శెట్టి.. తెలుగు, తమిళ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలతో తన మార్క్ చూపించింది. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె రోజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘కథనార్: ది వైల్డ్ సోర్సరర్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జయసూర్య పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం మొదటి లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో జయసూర్య పూర్తిగా రగ్గడ్ లుక్‌లో.. పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నాడు. అతను 9వ శతాబ్దంలో జీవించిన ఒక పురాణ సోర్సరర్‌గా ప్రసిద్ధమైన కడమట్టత్తు కథనార్ పాత్రను పోషిస్తున్నాడు. “నీ సమయాన్ని, నీ మనసును, నీ వాస్తవాన్ని దొంగిలించేవాడు” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది. ఇది ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. అనుష్కా శెట్టి ఈ చిత్రంలో ఎలాంటి లుక్‌లో కనిపిస్తుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఆమె కూడా రగ్గడ్, రా లుక్‌లో కనిపిస్తుందా అని చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె తన రాబోయే చిత్రం ‘ఘాటి’ లో గ్రామీణ లుక్‌లో కనిపించిన నేపథ్యంలో, కథనార్లో ఆమె పాత్ర కూడా బలమైన, తీవ్రమైనదిగా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ, చరిత్ర, మిస్టరీ సమ్మేళనంతో ఈ చిత్రం రూపొందుతోంది.
-
Home
-
Menu