మాలీవుడ్ లో మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ధీరం’

మాలీవుడ్ లో మరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ధీరం’
X

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ అన్నయ్య ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ "ధీరం". ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 47 రోజుల పాటు సాగిన షెడ్యూల్‌లో కోళికోడ్ , కుట్టిక్కాణం ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. రెమో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రెమోష్ ఎం.ఎస్., మలబార్ టాకీస్ బ్యానర్‌పై హారిస్ అంబళతింకల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జితిన్ టి. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

దీపు ఎస్. నాయర్, సందీప్ సదానందన్ కలిసి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. పూర్తి స్థాయిలో పోలీస్ గెటప్‌లో ఇంద్రజిత్ సుకుమారన్ కనిపించనుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.






ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్‌తో పాటు అజు వర్గీస్, దివ్య పిల్ల, నిషాంత్ సాగర్, రంజి పనిక్కర్, రెబ మోనికా జాన్, సాగర్ సూర్య (పణి ఫేం), అవంతిక మోహన్, ఆశికా అశోకన్, సాజల్ సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హబీబ్ రెహ్మాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ అయినప్పటికీ, వినూత్న కథా కథనాలతో రూపొందించబడిందని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Tags

Next Story