మెగాస్టార్ సినిమానే బీటవుట్ చేసింది !

ఈ నెల 10న విడుదలైన మెగాస్టార్ మమ్ముట్టి మలయాళ సినిమా ‘బజూకా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు, యాక్షన్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందనే హైప్‌తో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. అయితే .. అనూహ్యంగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ మూవీ అంచనాలకు తగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మొదటి రోజు రూ.2.21 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది.
కానీ అదే రోజు.. ఎవ్వరూ పెద్దగా ఊహించని సినిమా ‘ఆలప్పుళ జింఖానా’ ఆశ్చర్యకరంగా రూ.2.70 కోట్లు వసూలు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఈ సినిమాలో ప్రముఖ హీరోలు లేరు. ‘ప్రేమమ్’ ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ వంటి యంగ్ టాలెంటెడ్ ప్రధాన పాత్రలు పోషించాడు. సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. యూత్‌ఫుల్ ఎనర్జీ, ఫ్రెష్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక అదేరోజు వచ్చిన మరో చిత్రం ‘మరణమాస్’ ప్రముఖ దర్శకనటుడు బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చినా.. రూ.1.06 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. సో.. దీన్ని బట్టి.. స్పష్టమవుతుంది.. మలయాళ సినిమాల్లో మార్పు వస్తోందని. పెద్ద హీరోలు ఉన్నారంటే చాలు.. హిట్ అనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. నమ్మకమైన కథలు, కొత్తవారి నటన, చక్కని ప్రెజెంటేషన్ ఉంటే చాలు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
-
Home
-
Menu