సోషల్ మీడియా ఖాతాల్ని డీయాక్టివేట్ చేసింది

సోషల్ మీడియా ఖాతాల్ని డీయాక్టివేట్ చేసింది
X
ఐశ్వర్య లక్ష్మి తన సమకాలీన నటీమణులతో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే నటీమణి కాదు. కానీ ఆమె అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో తన ఖాతాలను పూర్తిగా డియాక్టివేట్ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

మల్లూ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసి, సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడంతో నెటిజన్లు షాకయ్యారు. ఆమె తన వ్యక్తిగత జీవితంపై.. కెరీర్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని, సోషల్ మీడియా అలవాట్లు తన ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయని వివరించింది.

ఐశ్వర్య లక్ష్మి తన సమకాలీన నటీమణులతో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే నటీమణి కాదు. కానీ ఆమె అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో తన ఖాతాలను పూర్తిగా డియాక్టివేట్ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐశ్వర్య లక్ష్మి చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “థగ్ లైఫ్” చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె తదుపరి సాయి ధరమ్ తేజ్‌తో కలిసి “సంబరాల యేటి గట్టు” లో నటిస్తోంది. అలాగే తమిళం, మలయాళంలో “మట్టి కుస్తీ 2”, “ఆశ” అనే చిత్రాల్లో కూడా కనిపించనుంది.

సోషల్ మీడియా అలవాట్లు తన వర్క్ ను ప్రభావితం చేస్తున్నాయన్న ఆమె వివరణను ముఖ్యంగా రెండు ప్రధాన చిత్రాలు పైప్‌లైన్‌లో ఉన్న ఈ సమయంలో.. పూర్తిగా నమ్మడం కష్టంగా ఉంది. ఐశ్వర్య లక్ష్మి ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలు ఉండవచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. గతంలో కొందరు నటీమణులు సోషల్ మీడియా ఖాతాలను డియాక్టివేట్ చేసిన తర్వాత వివాహ ప్రకటనలు చేశారు. ఇది ఐశ్వర్య డేటింగ్ లైఫ్‌పై గాసిప్‌లను మరింత రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి నిజమైన కారణం స్పష్టంగా తెలియలేదు. కానీ ఆమె నిర్ణయం చుట్టూ హడావిడి మాత్రం పెరుగుతోంది.

Tags

Next Story