10 నెలల వ్యవధిలో 5 సినిమాలు !

10 నెలల వ్యవధిలో 5 సినిమాలు !
X
ఇప్పటికే నాలుగు చిత్రాలు విడుదల కాగా.. ‘దృశ్యం 3’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో చిత్రం విడుదలకి సన్నద్ధమవుతున్నారు.

మలయాళంలో భారీ విజయం సాధించిన ‘దృశ్యం 3’ చిత్రం షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. మరోసారి జార్జ్ కుట్టి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు జీతు జోసెఫ్ సిద్ధమయ్యాడు. ఈ ఏడాది మోహన్‌లాల్ గతంలో కంటే మరింత బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాలుగు చిత్రాలు విడుదల కాగా.. ‘దృశ్యం 3’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో చిత్రం విడుదలకి సన్నద్ధమవుతున్నారు.

‘బరోజ్’ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న విడుదలైంది. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ‘ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు వచ్చాయి. ‘ఎంపురాన్, తుడరుమ్’ సినిమాలు అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘హృదయపూర్వం’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మోహన్‌లాల్ తన కొత్త సినిమా ‘వృషభ’ తో విడుదలకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. అంటే 10 నెలల వ్యవధిలో మోహన్‌లాల్ ఐదు చిత్రాలను పూర్తి చేయబోతున్నారన్నమాట.

ప్రాజెక్టుల ఆలస్యం విషయంలో ఆయన ఇక ఎటువంటి తప్పులు చేయడం లేదు. సాధారణంగా జీతు జోసెఫ్ తన చిత్రాలను తక్కువ సమయంలో పూర్తి చేస్తారని పేరుంది. ‘దృశ్యం 3’ చిత్రాన్ని కూడా మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. మోహన్‌లాల్ 60 ఏళ్ల వయసులో కూడా ఇంత బిజీగా ఉండటం అసాధ్యం. అయినప్పటికీ ఆయన ప్రేక్షకులను అలరించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేయడం విశేషం.

Tags

Next Story