మాలీవుడ్ అంటే నిజాయితీ, నేచురాలిటీ : ప్రియమణి

‘సెట్‌లో ఆత్మీయ వాతావరణం ఉంటుంది, పెద్ద తారలు వానిటీ వ్యాన్లలో ఒంటరిగా ఉండరు. అందరం కలిసి భోజనం చేస్తాం, మాట్లాడుకుంటాం, కళను మెరుగుపరచడంపై దృష్టి పెడతాం. మలయాళ చిత్రాల్లో ఉన్న నిజాయితీ, నేచురాలిటీ, నేపథ్యం, లైఫ్‌లా కనిపించే జూనియర్ ఆర్టిస్టులు, అంతా అసాధారణం. ప్రతీ సన్నివేశం మన ఇంట్లో జరిగిన ఒక నిజమైన సంఘటనలా అనిపిస్తుంది’ అని తన మదర్ వుడ్ మాలీవుడ్ పై జాతీయ అవార్డు గ్రహీత, భారతీయ నటి ప్రియమణి తెగ ప్రశంసల వర్షం కురిపించింది.
మలయాళ సినీ పరిశ్రమకు ఉన్న ప్రత్యేకత కూడా అదే. ఇక్కడ ఎక్కువగా ఆర్భాటాలు ఉండవు, అస్లీలత ఉండదు, కేవలం కథా నైపుణ్యమే ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు యుఎఇలో విడుదలైన ఆమె తాజా మలయాళ చిత్రం "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" ఈ నమ్మకానికి నిదర్శనం. ఇందులో ప్రముఖ నటుడు కుంచక్కో బోబన్ బాధిత పోలీస్ అధికారిగా కనిపించగా, అతడి భార్యగా ప్రియమణి నటించారు. తన గత జీవితం నుంచి వచ్చిన భయాలను ఎదుర్కొంటూ, కుటుంబాన్ని సమర్థంగా నిలబెట్టుకోవాల్సిన మహిళగా ఆమె పాత్ర సాగుతుంది.
దుబాయ్‌లో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, దూర సంబంధ జీవితం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఫ్యామిలీ మాన్ 3" వెబ్ సిరీస్, అలాగే మలయాళ సినిమాలు ఎందుకు విభిన్నంగా ఉంటాయన్న విషయాలను పంచుకుంది. ‘ఫ్యామిలీ మేన్ 3’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
-
Home
-
Menu