విలన్‌గా మారుతున్న మోహన్ బాబు

విలన్‌గా మారుతున్న మోహన్ బాబు
X
కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించినా ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాల్లో అలరించారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు పూర్తి స్థాయి విలన్ గా అలరించేందుకు సిద్ధమవుతున్నారట.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించబోతున్నారనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జయకృష్ణ సరసన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా నటించనుందట. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మొదట అనేక మంది స్టార్‌లను పరిశీలించినప్పటికీ, చివరికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. కథ వినగానే తన పాత్ర నచ్చి, మోహన్ బాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.

ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, లవ్, ఎమోషన్‌ల మేళవింపుతో అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. అక్టోబర్ 15న లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags

Next Story