రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న ‘మిరాయ్‘

రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న ‘మిరాయ్‘
X

సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్‘తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జ. అగ్ర కథానాయకులకి సైతం సాధ్యం కాని రీతిలో ఈ చిత్రంతో రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ‘హనుమాన్‘ పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో.. మళ్లీ ఆ స్థాయి రేంజులో ‘మిరాయ్‘ మూవీని రెడీ చేస్తున్నాడు.







ఈ మూవీలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా కీలక పాత్రలో భయపెట్టబోతున్నాడు. హిస్టారికల్ ఈవెంట్స్ తో ఫిక్షనల్ స్టోరీగా ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని తీర్చిదిద్దుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. లేటెస్ట్ గా ‘మిరాయ్‘ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 1న ‘మిరాయ్‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story