'మిరాయ్' మూవీ హైలైట్స్

మిరాయ్ మూవీ హైలైట్స్
X
‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ కొట్టిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి అలాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న 'మిరాయ్'తో వస్తున్నాడు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ‘మిరాయ్’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ కొట్టిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి అలాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న 'మిరాయ్'తో వస్తున్నాడు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ‘మిరాయ్’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ సినిమా సాధారణ యాక్షన్ థ్రిల్లర్ కాదు. చరిత్రతో పాటు ఫిక్షన్ కలిసిన ఒక గ్రాండ్ ఫాంటసీ అడ్వెంచర్ అని టీమ్ చెబుతుంది. అశోకుడి తొమ్మిది గ్రంథాల రహస్యాల చుట్టూ తిరిగే కథలో హీరో–విలన్ పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఇక ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ ఇప్పటికే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి.

ఈ సినిమాలో 20 అడుగుల ఎత్తున్న ‘సంపాతి’ పక్షి సీన్ కోసం 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ సెట్ వేసి, యానిమాట్రిక్స్ టెక్నాలజీతో ఆ సన్నివేశాన్ని రూపొందించారట. అంతేగాక తేజ సజ్జా థాయిలాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకొని తెరకెక్కించిన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

రితిక నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి భాగంలో ఆయననే విలన్‌గా చూపించినా, అసలైన మెయిన్ విలన్ రానా దగ్గుబాటి అని క్లైమాక్స్‌లో ట్విస్ట్ రాబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇది పార్ట్ 2కి రూట్ ఇస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంకా శ్రియ, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Tags

Next Story