రామ్ పై మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న #RAPO22 సినిమా షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రశంసిస్తూ, "ఆయన శరీరంలో స్ప్రింగులు ఉన్నట్లుగా అనిపిస్తుంది" అని సరదాగా వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌ను సందర్శించిన మంత్రి చిత్ర యూనిట్‌తో ముచ్చటించారు. రామ్ ఎనర్జీ, ప్రతిభను మెచ్చుకుంటూ, సినిమా విజయం కావాలని ఆకాంక్షించారు.
తెలుగు సినిమా అభివృద్ధికి ప్రభుత్వ మద్దతును ప్రస్తావిస్తూ, గోదావరి జిల్లాల్లో చిత్రీకరించిన సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. #RAPO22తో రామ్ మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాడు.
-
Home
-
Menu