ఫ్లైట్‌లో మెగాస్టార్ వివాహ వార్షికోత్సవ వేడుక!

ఫ్లైట్‌లో మెగాస్టార్ వివాహ వార్షికోత్సవ వేడుక!
X

ఫ్లైట్‌లో మెగాస్టార్ వివాహ వార్షికోత్సవ వేడుక!మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని ఫ్లైట్‌లో స్నేహితుల సమక్షంలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. దుబాయ్‌ వెళ్లేటప్పుడు నాగార్జున, అమల, నమ్రత తదితరుల మధ్య ఈ వేడుకను జరుపుకున్న ఫోటోలను మెగాస్టార్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. 'సురేఖ నా కలల జీవిత భాగస్వామి. ఆమె నా బలం, నా ఆధారం. ప్రపంచాన్ని మరింత తెలుసుకునే ప్రయాణంలో ఆమె ఎప్పుడూ నాకు తోడుగా ఉంటుంది. ఈ రోజు ఆమె పట్ల నా ప్రేమను వ్యక్తం చేసేందుకు అవకాశం దొరికింది' అంటూ సురేఖపై తన ప్రేమను ప్రకటించారు.

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిబ్రవరి 20, 1980న చిరంజీవి-సురేఖల వివాహం జరిగింది. అంటే ఇది వారి 45వ వివాహ వార్షికోత్సవ వేడుక.

Tags

Next Story