మెగాస్టార్ డ్యూయెల్ రోల్‌!

మెగాస్టార్ డ్యూయెల్ రోల్‌!
X
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా సినీ వర్గాల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా సినీ వర్గాల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో సినిమా కాస్టింగ్, లొకేషన్స్ సెర్చింగ్ పై దృష్టి పెట్టాడట అనిల్ రావిపూడి.

చిరంజీవి ఈ సినిమాలో ప్రత్యేక మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నాడని సమాచారం. అంతేకాక, చిరు ద్విపాత్రాభినయంతో అభిమానులకు మరో ప్రత్యేక అనుభూతిని అందించనున్నడనేది లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. రీ ఎంట్రీలో 'ఖైదీ నంబర్ 150' తర్వాత చిరు మళ్లీ డ్యూయెల్ రోల్ చేసే సినిమా ఇదే కానుంది.

ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి గత హిట్ సినిమాల ‘ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే, ఈ చిత్రాన్ని కూడా పక్కా వినోదాత్మకంగా తీర్చిదిద్దబోతున్నాడు. చిరంజీవి నటన, అనిల్ కామెడీ ట్రీట్ మెంట్ తో ఈ మెగా మూవీ మెగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మెగాభిమానులు. త్వరలో పట్టాలెక్కే ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tags

Next Story