కోట మృతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం

కోట మృతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం
X
తెలుగు సినిమా రంగంలో తనదైన శైలిలో, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త సినీ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

తెలుగు సినిమా రంగంలో తనదైన శైలిలో, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త సినీ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆయనతో నటించిన ఎన్నో సందర్భాలను తలచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.

చిరంజీవి తన పోస్ట్ లో “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా నేను, కోట శ్రీనివాసరావు గారు ఒకేసారి సినీ రంగంలో అడుగుపెట్టాం. అప్పటినుంచి ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించి, ప్రతి పాత్రను తన ప్రత్యేక శైలిలో పాఠంగా మలిచి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కామెడీ విలన్‌గానే కాదు, సీరియస్ విలన్ అయినా, సహాయ పాత్ర అయినా – ఆయన తళుక్కుమని మెరిసారు. ప్రతి పాత్రకు జీవం పోసారు.” అని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో కోట గారి కుటుంబంలో చోటు చేసుకున్న వ్యక్తిగత విషాదం ఆయనను మానసికంగా బాగా కుంగదీసిందని చిరంజీవి తెలిపారు. కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిదని పేర్కొన్న ఆయన – “ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” అని వెల్లడించారు.



Tags

Next Story