అనిల్ రావిపూడి సినిమాపై మెగా అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని, అనిల్ చెప్పిన సీన్స్ విని తాను కడుపుబ్బా నవ్వుతున్నట్లు వెల్లడించారు.
అలాగే విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి గోడలు లేవని, నటీనటుల మధ్య స్నేహభావం ఉందని చెప్పారు. విశ్వక్ ఈమధ్య ఒకసారి తనపై వచ్చిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం గురించి ప్రస్తావిస్తూ, ఇండస్ట్రీలో కాంపౌండ్ వంటిది ఏమీ ఉండదని, అందరూ కలిసే ఉన్నామని చిరు అన్నారు.
మొత్తంగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాపై మెగా అప్డేట్ వచ్చేసింది. ఈ వేసవిలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలవ్వనుందనే ప్రచారం ఉంది.
-
Home
-
Menu