'మెగా 157' నుంచి మెగా సీన్!

మెగా 157 నుంచి మెగా సీన్!
X
మెగాస్టార్ చిరంజీవి అన్ని రసాలను అద్భుతంగా పోషిస్తాడు. అయితే.. హీరోలలో హాస్యరసం పోషించడంలోనూ చిరుకి ప్రత్యేకమైన స్థానం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి అన్ని రసాలను అద్భుతంగా పోషిస్తాడు. అయితే.. హీరోలలో హాస్యరసం పోషించడంలోనూ చిరుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తనమార్క్ కామెడీతో స్క్రీన్‌ పై చెలరేగిపోవడంలో చిరు దిట్ట.

ఇక.. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను అందించడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడిది ప్రత్యేక శైలి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజులో ఉంటుందో 'మెగా 157' చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'మెగా 157' నుంచి ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

చిరంజీవికి అనిల్ రావిపూడి సీన్ వివరిస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. పక్కన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ బుల్లిరాజు కూడా కనిపిస్తున్నాడు. మొత్తంగా ఓ కామెడీ సీన్ కి సంబంధించిన విజువల్‌గా ఇది కనిపిస్తుంది. ఈ దృశ్యంలో మెగాస్టార్ లుక్ క్లియర్ గా కనిపిస్తుంది. చిరు ఎంతో ఛార్మింగ్ గా కనిపిస్తున్నాడు. మొత్తంగా.. ఈ వీడియో మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా రాలేదు. నెట్టింట మాత్రం జోరుగా చక్కర్లు కొడుతుంది.

Tags

Next Story