'విశ్వంభర' కోసం మెగా రీమిక్స్!

విశ్వంభర కోసం మెగా రీమిక్స్!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ నటి మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్‌తో స్టెప్పులేయనుండగా, అది చిరంజీవి హిట్ ఫిల్మ్ ‘అన్నయ్య’లోని ‘ఆట కావాలా పాట కావాలా’ రీమిక్స్ అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ పరంగా ఇంకా పెద్దగా హైప్ రాకపోవడం, టీజర్‌కు మిశ్రమ స్పందన రావడం కొంత నిరాశ కలిగిస్తోంది. కానీ ట్రైలర్‌తో ఈ నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌ను తుడిచిపెట్టేయాలని యూనిట్ భావిస్తోంది. వశిష్ఠ గతంలో ‘బింబిసార’ వంటి విజువల్ వండర్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ చిత్రంపైనా అందరిలోనూ మంచి నమ్మకమే ఉంది.

మరోవైపు 'విశ్వంభర' రిలీజ్ డేట్ విషయంలో కూడా గందరగోళం కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న తీసుకు రావాలని చిత్రబృందం భావిస్తుందట. అయితే.. దసరా కానుకగా సెప్టెంబర్ 25న బాలకృష్ణ ‘అఖండ 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ ‘ఓజి’ వాయిదా పడితే దసరా బరిలో చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ కన్ఫమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మొత్తంగా.. 'విశ్వంభర' రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Tags

Next Story