మెగా ఫోటో వైరల్.. సందీప్ పోస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా!

మెగా ఫోటో వైరల్.. సందీప్ పోస్ట్ కు ఫ్యాన్స్ ఫిదా!
X
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. చేసింది మూడు సినిమాలే అయినా సందీప్ సంపాదించిన క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. చేసింది మూడు సినిమాలే అయినా సందీప్ సంపాదించిన క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సందీప్ కి మాత్రం ఒకే ఒక్క హీరోతో పనిచేయడం లైఫ్ టైమ్ గోల్ అట. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.


సినిమాల్లోకి వెళ్లే ముందే మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని సందీప్ రెడ్డి వంగా. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. అంతేకాదు.. లేటెస్ట్ గా తన ప్రొడక్షన్ 'భద్రకాళి పిక్చర్స్' ఆఫీసులో మెగాస్టార్ చిరంజీవిది పెద్ద ఫోటో ఫ్రేము పెట్టించుకున్నాడు. ఆ ఫోటోని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందీప్ షేర్ చేశాడు.


చిరంజీవి 'ఆరాధన' సినిమాలోని ఫోటో ఇది. ఎప్పుడైతే ఈ ఫోటోని సందీప్ షేర్ చేశాడో.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేమికులు చిరు-సందీప్ కాంబినేషన్‌పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఒక వేళ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి.


అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి 'స్పిరిట్' సినిమాతో బిజీగా ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించే ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఆ తర్వాత 'యానిమల్' సీక్వెల్ 'యానిమల్ పార్క్' కూడా సందీప్ కిట్టీలో ఉంది. మరోవైపు మెగాస్టార్ సైతం బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. మొత్తంగా చిరంజీవి-సందీప్ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Tags

Next Story