ప్రభాస్ కి ధీటైన విలన్ గా మెగా హీరో?

ప్రభాస్ కి ధీటైన విలన్ గా మెగా హీరో?
X
హైట్, పర్సనాలిటీలలో ప్రభాస్ ను మ్యాచ్ చేసేలా విలన్ రోల్ ను డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి. 'స్పిరిట్'లో విలన్ రోల్ కోసం మెగా హీరోని సంప్రదించాడట.

రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'స్పిరిట్' ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే ఈ మూవీకి స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్.. త్వరలోనే పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.


సందీప్ గత చిత్రం 'యానిమల్' అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలీవుడ్ లో ఇదొక కల్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నటించిన రణ్‌బీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో, విలన్ గా నటించిన బాబీ డియోల్ కి అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 'స్పిరిట్'లోనూ హీరో ప్రభాస్ కి దీటుగా విలన్ రోల్ ను తీర్చిదిద్దుతున్నాడట సందీప్. ఆ పాత్రకోసం టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను సంప్రదిస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.


'స్పిరిట్' మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. అతని క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయట. ముఖ్యంగా ఓ యారెగెంట్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ కు దీటుగా.. హైట్, పర్సనాలిటీలలో అతన్ని మ్యాచ్ చేసేలా విలన్ రోల్ ను డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి. అలా.. ప్రభాస్ కి హైట్, పర్సనాలిటీలలో మ్యాచ్ అయ్యే స్టార్ వరుణ్ తేజ్. అందుకే ఆ పాత్రకోసం వరుణ్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెబలియస్ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు వరుణ్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.


ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాడు. లేటెస్ట్ గా మేర్లపాక గాంధీతో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. మరి.. ప్రభాస్ 'స్పిరిట్'లో వరుణ్ నటిస్తాడా? లేదా? అనేది మరికొన్న రోజుల్లో తేలనుంది.


Tags

Next Story