మెగా 157 టీమ్ వార్నింగ్!

మెగా 157 టీమ్ వార్నింగ్!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మెగా 157‘.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మెగా 157‘. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో అలరించనున్నాడు. చిరంజీవి ఇందులో తన అసలు పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. అందుకే ఈ సినిమాకు ‘మన శివ శంకర్ వరప్రసాద్ గారు‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ పాట, కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండగా, కొన్ని దృశ్యాలు అనధికారికంగా లీక్ కావడం కలకలం రేపింది. పూలతో అలంకరించిన బోటులో చిరంజీవి-నయనతార ప్రయాణిస్తున్న సన్నివేశాలను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. సినిమాలోని దృశ్యాలను, ఫోటోలను షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాయి.

‘సినిమా కోసం కష్టపడుతున్న టీమ్‌ను ఇలాంటి చర్యలు బాధపెడుతున్నాయి. అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని, లీక్ కంటెంట్‌ను షేర్ చేయవద్దని అభిమానులను మనవి చేస్తున్నాం‘ అని నిర్మాణ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story