‘మెగా 157‘ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!

‘మెగా 157‘ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!
X
అపజయమెరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. స్టార్స్ తో సినిమాలు తీసినా.. జెట్ స్పీడులో వాటిని పూర్తి చేసి.. అనుకున్న సమయానికి విడుదల చేయడంలో ఎక్స్ పెర్ట్ అనిల్.

అపజయమెరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. స్టార్స్ తో సినిమాలు తీసినా.. జెట్ స్పీడులో వాటిని పూర్తి చేసి.. అనుకున్న సమయానికి విడుదల చేయడంలో ఎక్స్ పెర్ట్ అనిల్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమానీ అంతే వేగంగా తీర్చిదిద్దుతున్నాడట.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ‘మెగా 157‘ చిత్రీకరణ వేగంగా సాగుతోంది. మే 23న మొదలైన తొలి షెడ్యూల్ ముందుగా అనుకున్న దానికంటే ఒకరోజు ముందే పూర్తి కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ మూవీలో మెగాస్టార్ ను వింటేజ్ మాస్, కామెడీ అవతార్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని కామెడీ సన్నివేశాలు చిత్రీకరించారట. చిరు కామెడీ టైమింగ్, ఎనర్జీ సెట్స్‌లో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించాయని తెలిసింది.

చిరంజీవి ఈ చిత్రంలో తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా నయనతార నటిస్తుంది. మరో కీలక పాత్రలో కేథరిన్ కనిపించనుందనే ప్రచారం ఉంది. టాలీవుడ్ వర్గాల ప్రకారం ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రత్యకమైన పాత్రలో మెరవనున్నాడట. అదేగానీ జరిగితే చిరు, వెంకీ ఇద్దరినీ ఒకే ఫ్రేములో చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి,

సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 2026, సంక్రాంతి కానుకగా ‘మెగా 157‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Tags

Next Story