మహాశివరాత్రి కానుకగా వస్తోన్న 'మజాకా'!

సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ 'మజాకా' ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతుంది. తొలుత ఫిబ్రవరి 21న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ఈ సినిమా, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
‘ధమాకా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటించగా, రావు రమేష్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. వినోదంతో నిండిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం, నిజార్ షఫీ ఛాయాగ్రహణం అందించారు.
'మజాకా' చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మించగా, బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన 'మజాకా' ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా శివరాత్రికి థియేటర్లలో అలరించడానికి 'మజాకా' వచ్చేస్తుంది.
-
Home
-
Menu