ఓటీటీలో ‘మయసభ‘ సంచలనం

ఓటీటీలో ‘మయసభ‘ సంచలనం
X
తెలుగులో రాజకీయ నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్‘. వాస్తవ సంఘటనల ప్రేరణతో దేవా కట్టా–కిరణ్ జయ్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

తెలుగులో రాజకీయ నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్‘. వాస్తవ సంఘటనల ప్రేరణతో దేవా కట్టా–కిరణ్ జయ్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి (కాకర్ల కృష్ణమనాయుడు), చైతన్య రావు (ఎంఎస్ రామి రెడ్డి)ల మధ్య స్నేహం–వైరం ఆధారంగా నడిచే ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఈ సిరీస్‌లో దివ్యా దత్తా, సాయి కుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్యా రవిచంద్రన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఆగస్టు 11–17 వారానికి గాను ‘మయసభ‘ 2.8 మిలియన్ల వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా మోస్ట్ వాచ్‌డ్ స్ట్రీమింగ్ షోలలో నెంబర్ 3 స్థానంలో నిలిచింది.

అన్ని భాషల కంటెంట్‌ను లెక్కల్లోకి తీసుకోవడం ప్రారంభించిన 2024 మే నుంచి టాప్ 3లోకి చేరిన మొట్టమొదటి తెలుగు సిరీస్‌గానూ చరిత్ర సృష్టించింది. సోనీ లివ్ లో ‘మయసభ‘ స్ట్రీమింగ్ అవుతుంది.

Tags

Next Story