‘మాస్ జాతర‘ టీజర్ అప్డేట్

‘మాస్ జాతర‘ టీజర్ అప్డేట్
X
మాస్ మహారాజా రవితేజ – శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర‘.

మాస్ మహారాజా రవితేజ – శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర‘. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వినాయకచవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతుంది. ఈనేపథ్యంలో ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్.

ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లిరిక్స్ విషయంలో మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. పాటకు అయితే మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించింది టీమ్. టీజర్‌ను ఆగస్టు 11న ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఆ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.



Tags

Next Story