‘ఇడియట్‘ను గుర్తు చేసిన ‘మాస్ జాతర‘!

‘ఇడియట్‘ను గుర్తు చేసిన ‘మాస్ జాతర‘!
X
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఓ స్పెషల్ మ్యూజికల్ ట్రీట్ రెడీ అవుతుంది. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర‘ నుంచి ‘తూ మేరా లవర్’ అనే ఫస్ట్ సింగిల్ వస్తోంది.

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఓ స్పెషల్ మ్యూజికల్ ట్రీట్ రెడీ అవుతుంది. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర‘ నుంచి ‘తూ మేరా లవర్’ అనే ఫస్ట్ సింగిల్ వస్తోంది. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. ఈ ట్యూన్, రవితేజ సూపర్ హిట్ మూవీ ‘ఇడియట్‘లోని ‘చూపులతో’ పాటను గుర్తు చేస్తోంది. అయితే ఈ పాటలో కొంతమేరకు మాత్రమే ‘ఇడియట్‘ సాంగ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. రవితేజ ఫ్యాన్స్ కు రెట్రో స్టైల్ లో మాస్ ట్రీట్ అందించేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేశారట.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోలో శ్రీలీల తన గ్లామర్‌తో స్క్రీన్‌ను మెస్మరైజ్ చేస్తుంది. రవితేజ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో మళ్ళీ తన మాస్ మ్యాజిక్‌ను రిపీట్ చేసేలా ఉన్నాడు. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అసలు మే నెలలోనే రావాల్సి ఉంది. అయితే.. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ.



Tags

Next Story