ఆహాలో తెలుగు ప్రేక్షకులకు 'మార్కో' ట్రీట్!

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. డిసెంబర్ 20, 2024న మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో జనవరి 1, 2025న థియేటర్లలోకి వచ్చిన 'మార్కో' ఇక్కడా మంచి వసూళ్లనే రాబట్టింది.
థియేట్రికల్ గా దుమ్మురేపిన 'మార్కో' ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఫిబ్రవరి 14నే తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంది ఈ చిత్రం. తాజాగా ఆహా లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ ఈరోజు నుంచి ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత చేరువయ్యే అవకాశముంది.
'మార్కో 'హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చని ప్రచారం జరుగుతున్నా మూవీ మేకర్స్ నుంచి స్పష్టత రాలేదు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.115 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మోస్ట్ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉన్ని ముకుందన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా 'మార్కో' నిలిచింది.
-
Home
-
Menu