‘కన్నప్ప‘ కోసం ఐమాక్స్ కు మనోజ్!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఈనేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు ముందుగానే ‘కన్నప్ప‘కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ లిస్టులో విష్ణు సోదరుడు మంచు మనోజ్ కూడా ఉండటం విశేషం.
గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో ‘కన్నప్ప‘కి బెస్ట్ విషెస్ చెప్పడమే కాదు.. మనోజ్ స్వయంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో సినిమాని వీక్షించడానికి వెళ్లడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
‘కన్నప్ప‘ విడుదలకు ముందే మనోజ్ ట్విటర్ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. మంచు మనోజ్ తన ట్వీట్లో, ‘ఈ సినిమా కోసం మా నాన్నగారు మోహన్ బాబు, ఆయన టీమ్ ఎంతో శ్రమించారు. ఇది బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. మా లిటిల్ చాంపియన్స్ అరి, వివి, అవ్రామ్లను స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తనికెళ్ల భరణి గారి కల సాకారమవుతుండడం ఆనందంగా ఉంది‘ అని పేర్కొన్నాడు. అయితే తన ట్వీట్లో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం ఇప్పటికే నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.
-
Home
-
Menu