మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సంబరాలు!

సంక్రాంతి పండగ వేడుక దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పండగను ఉత్సాహం గా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాక్‌స్టార్ మంచు మనోజ్ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఆనంద క్షణాల ఫొటోలను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్‌గా మారాయి.
మనోజ్ షేర్ చేసిన ఫొటోల్లో అతని భార్య, పిల్లలతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సీనియర్ నటుడు నరేష్ తనయుడు విజయ్ కృష్ణ కూడా కనిపించారు. ఫ్రెండ్స్‌తో కలిసి పండగ సంబరాలు జరుపుకుంటున్న ఆ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి.
మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్, విజయ్ కృష్ణ అత్యంత సన్నిహిత మిత్రులు అన్న విషయం తెలిసిందే. ఈసారి ఈ ముగ్గురు కుటుంబ సభ్యులతో కలసి పండగ వేడుకను మరింత ప్రత్యేకంగా జరుపుకున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సంప్రదాయ వేషధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి వంటి ప్రముఖులు కూడా తమ సంక్రాంతి సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.
సెలబ్రిటీల సంబరాల ఈ జోష్ చూసిన నెటిజన్లు తమ తమ క్రేజీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
-
Home
-
Menu