తెలుగులోకి మలయాళీ బ్లాక్‌బస్టర్!

తెలుగులోకి మలయాళీ బ్లాక్‌బస్టర్!
X
మలయాళం చిత్రాలకు తెలుగులో ఆదరణ పెరుగుతుంది. గడిచిన రెండేళ్లలో కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో అనువాదమై.. ఇక్కడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఈకోవలోనే లేటెస్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'నరివెట్ట'.

టొవినో థామస్ హీరోగా అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. 2003లో జరిగిన ముతంగ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసుల వృత్తి సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది.

సూరజ్ వెంజరమూడు, చేరన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. లేటెస్ట్ గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది మైత్రీ సంస్థ. రేపు (మే 30) ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Tags

Next Story