'మజాకా' ట్రైలర్: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీ టైమింగ్ అదుర్స్!

మజాకా ట్రైలర్: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీ టైమింగ్ అదుర్స్!
X

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. 'ఊరు పేరు భైరవకోన, రాయన్' వంటి వరుస విజయాల తర్వాత ఇప్పుడు 'మజాకా' అంటూ పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి సిద్ధమవుతున్నాడు. 'ధమాకా' దర్శకుడు నక్కిన త్రినాథరావు ఒక సాలిడ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాని తీసుకొస్తున్నాడు.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి కానుకగా విడుదలకు ముస్తాబవుతోన్న 'మజాకా' మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులకు నవ్వుల పంచేలా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

సందీప్ కి జోడీగా రితూ వర్మ నటించగా.. రావు రమేష్ కి జంటగా 'మన్మథుడు' బ్యూటీ అన్షు అలరించబోతుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చాడు. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ట్రాక్‌లు, మంచి కామెడీతో 'మజాకా' మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉంది టీమ్. ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags

Next Story