మహేష్ ‘శ్రీమంతుడు‘కి పదేళ్లు

మహేష్ ‘శ్రీమంతుడు‘కి పదేళ్లు
X
కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకొచ్చే సందేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకొచ్చే సందేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు‘ ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 7, 2015న విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

కథ విషయానికొస్తే ఒక సంపన్న వ్యాపారవేత్త కుమారుడైన హర్షవర్ధన్ (మహేష్ బాబు) చుట్టూ తిరుగుతుంది. లగ్జరీ జీవితాన్ని వదిలి, గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి అతనో గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఈ సినిమా ప్రధాన కథ. గ్రామ అభివృద్ధి, సామాజిక బాధ్యతల చుట్టూ సందేశాత్మకంగా ఈ కథను తీర్చిదిద్దాడు డైరెక్టర్ కొరటాల శివ. తన మొదటి చిత్రం ‘మిర్చి‘తోనే సంచలనం సృష్టించిన కొరటాల.. ‘శ్రీమంతుడు‘తో సామాజిక సందేశాన్ని వాణిజ్య హంగులతో కలిపి అద్భుతంగా అందించాడు. గ్రామీణ జీవన విధానం, అక్కడి సమస్యలను వాస్తవికంగా చూపించడంలో అతని దర్శకత్వం బలం కనిపిస్తుంది.

మహేష్ ప్రేమికురాలి పాత్రలో చారుశీలగా శ్రుతి హాసన్ ఆకట్టుకుంది. ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, ముకేష్ రుషి, సంపత్ రాజ్ అలరించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో అసెట్. చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. ఈ సినిమా తర్వాత చాలా మంది గ్రామీణ అభివృద్ధి గురించి ఆలోచించడం ప్రారంభించారు.



Tags

Next Story