బాక్సాఫీస్ వద్ద 'మహావతార్'

బాక్సాఫీస్ వద్ద మహావతార్
X
కన్నడ పరిశ్రమ నుంచి యానిమేషన్ రూపంలో వచ్చిన డివోషనల్ చిత్రం 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి భారీ విజయాన్ని అందుకుంది.

కన్నడ పరిశ్రమ నుంచి యానిమేషన్ రూపంలో వచ్చిన డివోషనల్ చిత్రం 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలు లేని ఈ మూవీ, కంటెంట్ బలంతోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వారం రోజుల్లోనే రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ముఖ్యంగా తెలుగు, హిందీ వెర్షన్లలోనే ఎక్కువ స్పందనను పొందింది. జూలై 25న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్లు మాత్రమే రాబట్టింది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఒక్కో రోజూ వసూళ్లు పెరిగిపోతూ వెళ్లాయి. కొన్ని చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. వారం రోజులకే రూ.53 కోట్ల మార్క్‌ను దాటడం నిజంగా ప్రశంసనీయం.

భక్త ప్రహ్లాదుని కథతో సంబంధం ఉన్న నరసింహస్వామి అవతారం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా, నేపథ్య సంగీతం సామ్ సీఎస్ అందించారు. తెలుగులో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేశారు. 3డీ ఫార్మాట్‌లో ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా యానిమేషన్ క్వాలిటీ, నేపథ్య సంగీతం ద్వారా మంచి అప్రిషియేషన్ పొందుతోంది.

హోంబలే ఫిలింస్ – క్లీమ్ ప్రొడక్షన్స్ కలసి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) పేరుతో పన్నెండేళ్ల ప్రణాళికతో విశ్ణు దశావతారాల ఆధారంగా చిత్రాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వచ్చిన నరసింహ తర్వాత, 2027 – పరశురామ, 2029 – రఘునందన్, 2031 – ద్వారకాధీశ్, 2033 – గోకులానంద, 2035 – కల్కి పార్ట్ 1, 2037 – కల్కి పార్ట్ 2 చిత్రాలు విడుదల కానున్నట్లు ప్రకటించారు.

Tags

Next Story