'మహాకాళి' మొదలైంది!

మైథలాజికల్ స్టోరీస్ ను బేస్ చేసుకుని కథలు చెప్పడంలో సిద్ధహస్తుడు ప్రశాంత్ వర్మ. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండానే 'హనుమాన్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. తన డైరెక్షన్ లో 'జై హనుమాన్' తీర్చిదిద్దుతున్న ఈ యంగ్ డైరెక్టర్.. తాను స్థాపించిన PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి మరికొన్ని సినిమాలను తీసుకొస్తున్నాడు.
ఈ లిస్టులో రాబోతున్న చిత్రం 'మహా కాళి'. పూజ కొల్లూరు దర్శకత్వంలో ఈ ఫాంటసీ డ్రామా రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా కథా నేపథ్యం బెంగాల్ ప్రాంతానికి సంబంధించినదిగా చెబుతున్నారు. మహిళా సూపర్ హీరో కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం 'ఛావా' ఫేమ్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారట. ‘ఛావా‘ సినిమాలో ఔరంగజేబుగా విలన్ పాత్రలో మెప్పించాడు అక్షయ్ ఖన్నా.
#MAHAKALI Shoot commenced today with a Pooja Ceremony 🪔⚡@PujaKolluru @RKDStudios#RKDuggal #RiwazRameshDuggal @ThePVCU#MahakaliShootBegins pic.twitter.com/GBG3shIfob
— Prasanth Varma (@PrasanthVarma) May 12, 2025
-
Home
-
Menu