'మదరాసి' ట్రైలర్ అదుర్స్

మదరాసి ట్రైలర్ అదుర్స్
X
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన హై యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, బిజు మేనన్, విక్రాంత్, షబీర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన హై యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, బిజు మేనన్, విక్రాంత్, షబీర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకాబోతున్న 'మదరాసి' ట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ విషయానికొస్తే.. మురుగదాస్ మార్క్ మెస్సేజ్ తో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, గూస్‌బంప్స్ తెప్పించే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఎన్ఐఏ ఆఫీసర్‌గా శివకార్తికేయన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. భారీ యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఈ ట్రైలర్ లో మరో హైలైట్‌. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story