వెంకటేష్ విడుదల చేసిన ‘మదగజరాజ‘ ట్రైలర్!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్‘ ఘన విజయాలు సాధించినట్టే.. తమిళనాట పొంగల్ పోరులో సూపర్ డూపర్ హిట్టైంది విశాల్ ‘మదగజరాజ‘. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీ 12 ఏళ్ల క్రితం రూపొందడం. అలా పుష్కర కాలం తర్వాత విడుదలైనా ప్రేక్షకుల మన్ననలు పొందిందంటే ‘మదగజరాజ‘ ఎంతో స్పెషల్ అని చెప్పాలి.
ముఖ్యంగా ఈ సినిమాని ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా సుందర్ సి తెరకెక్కించిన విధానానికి మంచి మార్కులు పడ్డాయి. విశాల్ యాక్షన్.. సంతానం కామెడీ.. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ ‘మదగజరాజ‘ విజయంలో కీలక భూమిక పోషించాయి. ఎప్పుడూ విశాల్ నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ సైమల్టేనియస్ గా రిలీజవుతుంటాయి. ఈసారి తమిళంలో విజయం సాధించిన తర్వాత ‘మదగజరాజ‘ తెలుగులో విడుదలవుతుంది.
జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘మదగజరాజ‘ ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మరి.. తమిళం తరహాలోనే తెలుగులోనూ ‘మదగజరాజ‘ మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
-
Home
-
Menu