బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’!
X
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.

ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలోనే రూ. 14.91 కోట్ల షేర్ సాధించింది. ఒక్క మూడో రోజులోనే రూ. 5.36 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టడం విశేషం. అలాగే, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘మ్యాడ్ స్క్వేర్’ సత్తా చాటి, వన్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మొత్తంగా గ్రాస్ వసూళ్ల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులకు రూ.55.2 కోట్లను సాధించింది.

ప్రధాన తారాగణమైన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం తమ అల్లరితో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు. సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మాణంలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు విశేషమైన వినోదాన్ని అందిస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, శామ్‌దత్ ఛాయాగ్రహణం టెక్నికల్ గా 'మ్యాడ్ స్క్వేర్'కి మంచి ప్లస్ పాయింట్స్.

Tags

Next Story