బ్లాక్ బస్టర్ వసూళ్ల హంగామా

బ్లాక్ బస్టర్ వసూళ్ల హంగామా
X
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మ్యాడ్ స్క్వేర్‘ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మ్యాడ్ స్క్వేర్‘ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్‘ నాలుగు రోజుల వసూళ్ల వివరాలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వెల్లడించింది.

థియేటర్లలో నవ్వులు, థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు అంటూ నాలుగు రోజులకు ‘మ్యాడ్ స్క్వేర్‘ రూ.69.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు తెలిపింది నిర్మాణ సంస్థ. చిన్న సినిమాల సీక్వెల్స్ కు సెపరేట్ క్రేజ్ తీసుకొచ్చిన సితార సంస్థ.. గత ఏడాది మార్చిలో విడుదలైన ‘టిల్లు స్క్వేర్‘తో వంద కోట్ల క్లబ్ ను సాధించింది. ఇప్పుడు ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్‘తోనూ మరో సెంచరీ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Next Story