‘మ్యాడ్ స్క్వేర్‘ ఫస్ట్ డే కలెక్షన్స్!

‘మ్యాడ్ స్క్వేర్‘ ఫస్ట్ డే కలెక్షన్స్!
యంగ్ హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్‘ తొలిరోజు భారీ ఓపెనింగ్‌ను సాధించింది. 2023లో విడుదలైన ‘మ్యాడ్‘కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మ్యాడ్ స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో విడుదలై తొలి రోజే రూ. 20.8 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టి ఓ రికార్డ్ సృష్టించింది. ఈ అంచనాలను ముందే ఊహించిన నిర్మాత నాగవంశీ మాటలు నిజమయ్యాయని నెటిజన్లు అంటున్నారు. ‘మ్యాడ్‘ సినిమా టోటల్ గా రూ. 26 కోట్లు కలెక్షన్ రాబట్టగా, ‘మ్యాడ్ స్క్వేర్‘ తొలి రోజే ఆ కలెక్షన్లకు దగ్గరగా వచ్చేసింది.
ప్రస్తుతం థియేటర్లలో ‘ఎంపురాన్, వీర ధీర శూర, రాబిన్ హుడ్‘ వంటి చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, ‘మ్యాడ్ స్క్వేర్‘ భారీ ఓపెనింగ్స్ సాధించడం గమనార్హం. ఈ సినిమా కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించారని వార్తలు వస్తుండగా, కలెక్షన్లు చూస్తుంటే సినిమా బిగ్ హిట్ దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu