'వీరమల్లు' కోసం లోకేష్ ట్వీట్!

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నటించిన తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ హైప్ కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమైన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ చిత్రం విడుదల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. 'మా పవన్ అన్న సినిమా కోసం నేను కూడా అభిమానిలా ఎదురుచూస్తున్నా. ఆయన స్వాగ్, పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అంటూ లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోకేష్ నుంచి ఇలాంటి పోస్ట్ రావడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరికొద్ది నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల్లో 'హరిహర వీరమల్లు' ప్రీమియర్స్ మొదలవుతున్నాయి.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
-
Home
-
Menu