RC16 సెట్స్ లో లిటిల్ మెగా ప్రిన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆద్యంతం పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలోని చరణ్ మేకోవర్ ను చూస్తుంటే మళ్లీ 'రంగస్థలం' నాటి రోజులు గుర్తుకొచ్చేలా ఉంది. ఈ మూవీలో గుబురు గడ్డంతో చెర్రీ సమ్‌థింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకోసం చరణ్ తన ఫిట్‌నెస్ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు. ఇందులోని స్పోర్ట్స్‌మ్యాన్ క్యారెక్టర్ కోసం రిగరస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం RC16 శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా రామ్ చరణ్ తన షూటింగ్ లొకేషన్‌కు ఓ ప్రత్యేక అతిథిని తీసుకెళ్లాడు. అది మరెవరో కాదు ఆయన ముద్దుల కూతురు క్లిన్ కారా. తన పాప సెట్స్‌కు వచ్చిన సందర్భంగా, రామ్ చరణ్ ప్రత్యేకంగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'మై లిటిల్ గెస్ట్ ఆన్ సెట్' అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
-
Home
-
Menu